సత్యసాయి: లేపాక్షిలో హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహణ నేపథ్యంలో నంది రోడ్డును ఈరోజు రాత్రి తాత్కాలికంగా మూసివేశారు. వాహనదారులు జటాయు రోడ్ లేదా బైపాస్ మార్గం ద్వారా వెళ్లాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమం ఈరోజు రాత్రి వరకే ఉంటుందని, రేపు ఉదయం నుంచి నంది రోడ్డును యథావిధిగా ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు తెలిపారు.