MNCL: రైతులందరు తప్పక ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ADA రాజా నరేందర్ కోరారు. బెల్లంపల్లి మండలం పెర్కపల్లిలో ఇవాళ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో AO సుద్దాల ప్రేమ్ కుమార్, AEO శ్రీనివాస్‌లతో కలిసి పాల్గొన్నారు. ఫార్మర్ రిజిస్ట్రీ PM కిసాన్, ఎరువులు, వ్యవసాయ యాంత్రికరణ మొదలగు పథకాలను రిజిస్ట్రేషన్ నెంబర్లతో అనుసంధానిస్తారని పేర్కొన్నారు.