ఉమెన్స్ ప్రిమియర్ లీగ్ 2026 సీజన్లో భాగంగా యూపీ వారియర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ భారీ స్కోర్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ఆష్లే గార్డెనర్ (65) హాఫ్ సెంచరీ చేసింది. అనుష్క శర్మ (44), సోఫీ డివైన్ (38), జార్జియా (27*) రాణించారు. యూపీ బౌలర్లలో సోఫీ ఎక్లెస్టోన్ 2 వికెట్లు తీసింది.