సత్యసాయి: రొద్దం మండల కేంద్రం నుంచి హిందూపురం వైపు బయలుదేరిన RTC బస్సులో మంత్రి సవిత శనివారం ప్రయాణించారు. ‘స్త్రీ శక్తి’ పథకం ద్వారా కూటమి ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బస్సు ప్రయాణ సౌలభ్యంపై మహిళా ప్రయాణికులతో మాట్లాడి, వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహిళా ప్రయాణికులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.