MDCL: రేషన్ షాపులలో ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించాలని అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ఆయన మాట్లాడుతూ.. సరైన తూకం చేస్తూ శుభ్రతతో అన్ని రేషన్ కార్డు దారులకు అంతరాయం లేకుండా సేవలు అందించాలని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం అల్వాల్ సర్కిల్ అల్వాల్ డివిజన్ పరిధిలోని రేషన్ షాప్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.