టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఒకప్పటి స్టార్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్(Rakesh Master) మరణించారు. కొన్ని రోజులకు ముందే ఆయన వీడియోల(Videos)ను యూట్యూబ్లో ప్రేక్షకులు వీక్షించారు. ఇంతలోనే ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారనే వార్త ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆదివారం ఉదయం రాకేష్ మాస్టర్ కు రక్త విరోచనాలయ్యాయి. దీంతో కుటుంబీకులు ఆయన్ని హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన సాయంత్రం 5 గంటలకు మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్స్ వల్ల మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. రాకేష్ మాస్టర్(Rakesh Master) తన మరణం గురించి ముందే మాట్లాడారు. తన శరీరంలో మార్పులు వస్తున్నట్లు తనకు తెలుస్తోందని, తాను అస్తమించే సూర్యుడినని ఆయన ఓ వీడియో(Video)లో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతోంది.
రాకేష్ మాస్టర్(Rakesh Master) వీడియో చూసిన నెటిజన్లు ఎమోషనల్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు. రాకేష్ మాస్టర్ అసలు పేరు ఎస్.రామారావు. ఆట, ఢీ వంటి డ్యాన్స్ షో(Dance Shows)లతో రాకేష్ మాస్టర్ తన కెరీర్ని స్టార్ చేశారు. ఇప్పటి వరకూ ఆయన దాదాపు 1500 పైగా సినిమాలకు పనిచేశారు. లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు, చిరునవ్వు వంటి సూపర్ హిట్ సినిమాలకు ఆయన కొరియోగ్రఫీ(Choreography) చేసి ఫేమస్ అయ్యారు. తిరుపతిలో జన్మించిన రాకేష్ మాస్టర్ హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. ప్రస్తుతం ఆయన చివరి మాటలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. స్టార్ కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్(Jani Master), శేఖర్ మాస్టర్(Sekhar Master) ఆయన శిష్యులే.