»Rangabali Movie Song Promo Release From Nagashauryas Rangabali
Rangabali Movie: నాగశౌర్య ‘రంగబలి’ నుంచి సాంగ్ ప్రోమో రిలీజ్
హీరో నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం రంగబలి. ఈ సినిమా నుంచి సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. పూర్తి సాంగ్ ను రేపు సాయంత్రం విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
టాలీవుడ్(Tollywood) సినీ ఇండస్ట్రీలో హీరో నాగశౌర్య(Hero NagaShourya)కు మంచి హిట్ పడలేదు. వరుస ఫ్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేసుకుపోతున్నాడు. ఆయన సినిమాలు వరుసగా థియేటర్లలో సందడి చేయనున్నాయి. ప్రస్తుతం నాగశౌర్య చేస్తున్న సినిమా రంగబలి(Rangabali Movie). ఈ మూవీకి పవన్ బసంసెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో యుక్తి తరేజ హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది. నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇప్పటికే రంగబలి సినిమా(Rangabali Movie) నుంచి పోస్టర్లు విడుదలయ్యాయి. తాజాగా ఈ మూవీ నుంచి కల కంటూ ఉంటే సాంగ్ ప్రోమోను చిత్ర యూనిట్ రిలీజ్(Song Promo Release) చేసింది. ఈ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి సీహెచ్ మ్యూజిక్ అందించారు. ప్రస్తుతం శరవేగంగా సాగుతున్న ఈ మూవీ షూటింగ్ జులై 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ ప్రోమో సాంగ్ పూర్తి పాటను జూన్ 19న సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.
రంబలి సినిమా(Rangabali Movie)లో సత్య, అనంత్ శ్రీరామ్, గోపరాజు రమణ, శుభలేఖ సుధాకర్ కీలకపాత్రలలో కనిపించనున్నారు. ఈ మూవీనే కాకుండా నాగశౌర్య(Hero NagaShourya) ఖాతాలో నారి నారి నడుమ మురారి, పోలీస్ వారి హెచ్చరిక వంటి సినిమా షూటింగ్(Shooting) జరుపుకుంటున్నాయి. వాటికి సంబంధించిన అప్ డేట్(Update) కూడా త్వరలోనే ప్రకటించనున్నారు.