AP: రైతుల భూరికార్డులన్నీ బ్లాక్చైన్లో భద్రంగా ఉంటాయని CM చంద్రబాబు తెలిపారు. భూరికార్డులను ఎవరూ మార్చలేరని.. మోసం చేయలేరని స్పష్టం చేశారు. ఫోన్లో స్కాన్ చేసి చూసినా మీకు తెలిసిపోతుందన్నారు. QR కోడ్ పెట్టామని.. లింక్ డాక్యుమెంట్లు వచ్చేలా చూస్తామని చెప్పారు. లక్షా 18 వేల పాస్బుక్ల్లో ఉన్న లోపాలను సరిచేస్తున్నామన్నారు.