ASF: జిల్లాలో అక్రమ పశువుల రవాణా రోజురోజుకు పెరిగిపోతోంది. జిల్లాలో ఎక్కడో ఒక చోటా పట్టుబడుతున్న వారిలో మార్పు మాత్రం రావట్లేదని జంతు ప్రేమికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు తనిఖీలు చేసి పట్టుకుంటున్న కూడా అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుంచి జైనూర్, సిర్పూర్ టి, వాంకిడి మండలాల మీదుగా పెద్ద ఎత్తున అక్రమ రవాణా జరుగుతోంది.