రాహుల్ గాంధీ జోడో యాత్ర నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఆయన యాత్ర దేశ రాజధాని ఢిల్లీలో సాగుతోంది. కాగా… రాహుల్ జోడో యాత్రకు కమల్ హాసన్ సంఘీభావం తెలిపారు. రాహుల్ గాంధీ తో కలిసి కమల్ హాసన్ కూడా ఈ జోడో యాత్రలో నడవడం విశేషం. ఈ రోజు ఉదయం 6 గంటలకు ఢిల్లీలో ప్రారంభమైన యాత్ర సాయంత్రం 4.30 గంటలకు ఎర్రకోట వద్ద ముగిసింది. ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించిన కమల్ తన మనసులో భావాలను వ్యక్త పరిచాడు. తమిళంలో మాట్లాడాడు.
ఒక భారతీయుడిగా తాను ఇక్కడికి వచ్చానని కమల్ తెలిపాడు. తన తండ్రి కాంగ్రెస్ వాది అని గుర్తుచేసుకున్నాడు. తన సొంత అభిప్రాయాలకు అనుగుణంగా ఓ రాజకీయ పార్టీని స్థాపించానని కమల్ తెలిపాడు. దేశం కోసం కలిసి రావలసి వచ్చినప్పుడు పార్టీలకతీతంగా పనిచేయాలని, అందుకే తాను పాదయాత్రలో పాల్గొనడానికి వచ్చానని కమల్ తెలిపాడు.