NLG: దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ను ఆర్టీసీ డిపో నూతన మేనేజర్ విజయకుమారి శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ఆర్టీసీ వారికి పలు సూచనలు చేశారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని అన్నారు. ప్రభుత్వం మహాలక్ష్మి పథకం అమలు చేస్తున్నందున మహిళా ప్రయాణికుల పట్ల సిబ్బంది మర్యాదగా నడుచుకునే విధంగా చూడాలని తెలిపారు.