KMM: కరకగూడెం పోలీస్ స్టేషన్‌పై మావోయిస్టుల దాడి జరిగి నేటికి 29 ఏళ్లు పూర్తయ్యాయి. 1997 JAN 9న అర్ధరాత్రి మావోయిస్టులు స్టేషన్‌పై విరుచుకుపడ్డారు. భవనాన్ని పేల్చివేసి, విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 16 మంది పోలీసులు అమరులయ్యారు. అనంతరం స్టేషన్ లోని ఆయుధాలను వారు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన నాటి ఉమ్మడి ఏపీలో సంచలనం సృష్టించింది.