లియో మొదటి సింగిల్ ప్రకటన గురించి కీలక అప్ డేట్ వచ్చేసింది. విజయ్(vijay) పుట్టినరోజు జూన్ 22న ఇది రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈ చిత్ర డైరెక్టర్ ట్విట్ చేయగా..నెట్టింట వైరల్ అవుతోంది.
తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి-లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో ఇప్పటికే మాస్టర్(master) మూవీ వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. విక్రమ్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందించిన తరువాత మరోసారి ఈ క్రేజీ కాంబోలో సెట్ అవ్వడం, షూటింగ్ కొనసాగుతుండటంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. త్వరలోనే ఈ సినిమా నుంచి క్రేజీ అప్ డేట్స్ అందనున్నాయని టాక్ వినిపిస్తోంది. తాజాగా లోకేష్ కనగరాజ్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా స్పందించి..ఈ మూవీ నుంచి రాబోయే అప్ డేట్స్ ని ఉద్దేశిస్తూ..రెడీ హా అంటూ ట్వీట్ చేశారు.
కాగా, లియో చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా, విజయ్(vijay) బి-డే రోజున ఆయన అభిమానులను ఆనందపరచడానికి సిద్ధంగా ఉన్నామని మేకర్స్ వెల్లడించారు. 22 జూన్ 2023న అతని పుట్టినరోజు రోజున ఈ సినిమా మొదటి సింగిల్‌ని మేకర్స్ విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తుండగా, సంజయ్ దత్, అర్జున్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా అక్టోబర్ 19న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రియా ఆనంద్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, శాంతి మాయాదేవి, మాథ్యూ థామస్, మన్సూర్ అలీ ఖాన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం సెవెన్ స్క్రీన్ స్టూడియోస్‌పై నిర్మించబడింది. ఎల్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.