MHBD: ప్రయాణానికి ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని పెద్దవంగర SI ప్రమోద్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో హెల్మెట్ ధరించడంతో కలిగే ప్రయోజనాలను వాహనదారులకు వివరించారు. తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, లేదంటే MV నిబంధనల ప్రకారం జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ రాజారాం పాల్గొన్నారు.