సత్యసాయి: కదిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి ఖాద్రీశుడు అశ్వవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. పురవీధుల్లో స్వామివారిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మంగళవాయిద్యాలు, భజన బృందాల కోలాహలం మధ్య వాహన సేవ కనులపండువగా సాగింది. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారి ఊరేగింపులో పాల్గొన్నారు.