AP: తరతరాల మధ్య కుటుంబ బంధాలను భాష బలపరుస్తుందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. తెలుగు నేర్చుకున్న పిల్లలకు విషయ పరిజ్ఞానం, జ్ఞాపకశక్తి ఎక్కువ ఉంటుందన్నారు. తాను 25 ఏళ్లు అమెరికాలో ఉన్నా.. మీ అందరితో ఉన్నానంటే కారణం తెలుగు భాష అని చెప్పారు. గతంలో చందమామ కథలు, సామెతలు చెప్పి పిల్లలను పెంచారని, ఆంగ్లం నేర్చుకోవడం తప్పుకాదు.. తెలుగు మర్చిపోవడం తప్పు అని తెలిపారు.