NLR: బుచ్చిపట్టణంలోని బెజవాడ బుజ్జమ్మ జిల్లా ప్రజా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల 2000-2005 సంవత్సరాలకు చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం జరిగింది. సుమారు 25 సంవత్సరాల తర్వాత మిత్రులు ఒక చోట చేరి ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఒకరినొకరి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తమకు చదువు చెప్పిన ఉపాధ్యాయులను సత్కరించి పూర్వపు జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.