భీమవరం పట్టణంలో మాంసం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గత రెండు వారాల్లో కిలోపై రూ. 30 వరకు పెరిగి చికెన్ (స్కిన్ లెస్) రూ. 300 మార్కును చేరింది. లైవ్ కోడి రూ. 270, మటన్ రూ. 1000, నాటుకోడి రూ. 600 గా ఉన్నాయి. రొయ్యలు రూ. 250 నుంచి, చేపలు రూ. 150 నుంచి లభిస్తున్నాయి. ధరల పెరుగుదలతో ఆదివారం మాంసం కొనాలంటే సామాన్యులు బెంబేలెత్తుతున్నారు.