NZB: కేంద్ర పాలిత ప్రాంతం డయ్యూ డామన్‌లో ఈ నెల 5 నుంచి 9 వరకు జరిగే ‘ఖేలో ఇండియా’ బీచ్ వాలీబాల్ పోటీలకు తెలంగాణ జట్టు కోచ్‌గా ఆర్మూర్ మండలం మగ్గిడి పాఠశాల పీఈటీ మధు ఎంపికయ్యారు. ఆయన ఎంపిక పట్ల వాలీబాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గజ్జల రమేష్ బాబు, జిల్లా అధికారి పవన్, హెచ్ఎం హరిత, క్రీడా సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.