WGL: వరంగల్ ములుగు రోడ్డులోని కొత్తపేట ఎన్ఎస్ఆర్ ఆసుపత్రి సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరెపల్లికి చెందిన గీత కార్మికుడు గౌని అనిల్‌కుమార్ గౌడ్ (48) అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌పై వెళ్తుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. రింగ్ రోడ్డు వద్ద భద్రతా చర్యలు లేకపోవడమే ప్రమాదాలకు కారణమని స్థానికులు ఆరోపించారు.