TG: మాజీ సీఎం KCR సభకు వస్తారని, సలహాలు, సూచనలు ఇస్తారని అనుకున్నామని CM రేవంత్ అన్నారు. KCR సలహాలు ఇస్తే తీసుకోవాలని మేమంతా భావించామని తెలిపారు. సభలో మాటల గారడీ చేయలేరని.. అందుకే సభను ప్రజలు నమ్ముతారని చెప్పారు. అసెంబ్లీ బయట మాట్లాడే మాటలకు ప్రాధాన్యత ఉండదని స్పష్టం చేశారు. కేసీఆర్ సభకు రావాలని మేం పదే పదే విజ్ఞప్తి చేస్తూ వచ్చామని గుర్తు చేశారు.