కోనసీమ: మండపేట నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అత్యుత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. మండపేట మండలం సర్వసభ్య బడ్జెట్ సమావేశాలు వైస్ ఎంపీపీ పసుమర్తి నాగేశ్వరరావు అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు విచ్చేశారు. ఆయన బడ్జెట్‌పై చర్చించి ఆమోదించారు.