GDWL: ఎర్రవల్లి మండలంలోని పుల్లారెడ్డి పెట్రోల్ బంక్ సమీపంలో NH-44 రహదారిపై శనివారం జరిగిన ప్రమాదంలో ఉప్పరి లక్ష్మణ్ (60) మృతి చెందారు. రోడ్డు దాటుతుండగా కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆయన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో లక్ష్మణ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.