Covid Vaccine Personal Cowin Data Leaked In Telegram
Cowin Data: కొవిడ్ వ్యాక్సినేషన్‌కు సంబంధించి కొవిన్ పోర్టల్‌లో (Cowin Data) ఉన్న సమాచారం బయటకు వచ్చింది. వ్యక్తుల పేర్లు, ఫోన్ నంబర్లు, ఆధార్, పాన్ కార్డు వివరాలు టెలిగ్రామ్ యాప్‌లో కనిపించాయి. ఎవరైనా సరే సమాచారం తీసుకునేలా డేటా రావడం కలకలం రేపుతోంది. కొవిడ్ వ్యాక్సిన్ కోసం కొవిన్ పోర్టల్‌ను కేంద్రం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. డేటా ఎంటర్ చేసి టీకా తీసుకున్నారు. ఓకే నంబర్‌తో ఫ్యామిలీ మొత్తం వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇప్పుడు సమాచారం బయటకు రావడంతో ఆందోళన నెలకొంది.
కీలక సమాచారం టెలిగ్రామ్ (telegram) యాప్‌లో కనిపించింది. బాట్లో వ్యక్తుల ఫోన్ నంబర్, లేదంటే ఆధార్ నంబర్ ఎంట్రీ చేసినా సరే సమచారం వస్తుందట. విదేశాలకు వెళ్లేందుకు కొందరు పాస్ పోర్ట్ వివరాలు అందజేశారు. అలాంటి వారి డేటా కూడా లీకేజీలో బయటకు వచ్చింది. డేటా వచ్చిన తర్వాత చాట్ బాట్ నిలిచిపోయిందని తెలిసింది. కొవిన్ పోర్టల్ లాగిన్ అయి.. మొబైల్‌కు ఓటీపీ వచ్చిన సమయంలో సమాచారం కనిపిస్తోంది. ఓటీపీ రాకున్నా డేటా బయటకు రావడం సందేహాం కలిగిస్తోంది.
డేటా లీకయిన వారిలో ప్రముఖులు ఉన్నారు. కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషన్ ఫోన్ నంబర్ ఎంటర్ చేస్తే పూర్తి వివరాలు వస్తున్నాయని మలయాళ మనోరమ పేర్కొంది. కాంగ్రెస్ నేతలు జైరామ్ రమేశ్, కేసీ వేణుగోపాల్, పి చిదంబరం, టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ వివరాలు కూడా వస్తున్నాయి. ఇదీ తీవ్రమైన అంశమని టీఎంసీ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే స్పందించారు. స్క్రీన్ షాట్లను ట్విట్టర్లో పోస్ట్ చేశారు.