కెనడాలోని వలసదారులకు ‘వర్క్ పర్మిట్’ గడువు ముగియడం పెను సవాలుగా మారింది. 2025 డిసెంబరు నాటికే 10 లక్షల మంది పర్మిట్లు ముగియగా.. ఈ ఏడాది మరో 9 లక్షల మందికి గడువు తీరనుంది. దీంతో దాదాపు 19 లక్షల మంది చట్టబద్ధ నివాస హోదా కోల్పోయే ప్రమాదం ఉంది. వీరిలో సగం మంది భారతీయులే ఉండటం ఆందోళనకరం. వీరంతా ఇప్పుడు శాశ్వత నివాసం (PR) లేదా కొత్త వీసా కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.