KNR: గ్రామ సమాఖ్య VOల ఆధ్వర్యంలో చిగురుమామిడి మండలం లంబాడిపల్లి గ్రామంలో ఇవాళ ముగ్గుల పోటీలు అట్టహాసంగా జరిగాయి. సర్పంచ్ కటం సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రంగురంగుల ముగ్గులతో తమ ప్రతిభను చాటారు. ఇందులో మొదటి 5 స్థానాల్లో నిలిచిన విజేతలు మండల స్థాయి పోటీలకు ఎంపికవుతారని సర్పంచ్ తెలిపారు.