VZM : వేపాడ మండలంలో గల బల్లంకి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిలో గల రైవాడ కాలువపై బ్రిడ్జి నిర్మాణానికి ఎస్ కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ.. రూ. 43.65 లక్షల నిధులతో తమ చిరకాల కోరికైనా రైవాడ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. దీంతో మూడు మండలాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.