నెమ్మదిగా శ్వాస తీసుకోవడం సాధనం చేయండి. నిమిషానికి 5 లేదా 6 సార్లు గాలి పీల్చి వదలడం ద్వారా చాలా ప్రయోజనాలు కలుగుతాయి. మొదటి నిమిషం పూర్తయ్యేసరికి హృదయ స్పందన రేటు తగ్గుతుంది. మూడు నిమిషాల్లోపు గుండె, మెదడుకు సమాచారాన్ని చేరవేసే వాగస్ నాడి చురుగ్గా మారుతుంది. 5ని.లకి ఆందోళన మాయమవుతుంది. ఈ ప్రక్రియను రోజూ సాధన చేస్తే రక్తపోటు నియంత్రణలో ఉండటంతో పాటు నిద్ర మెరుగవుతుంది.