MBNR: విద్యతో మహిళలకు విముక్తి దీపం వెలిగించిన సావిత్రిబాయిపూలే భావితరాలకు స్ఫూర్తిదాయకమని భూత్పూర్ మండలం అన్నసాగర్ సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఆమె జయంతి పురస్కరించుకుని చిత్రపటానికి పూలమాలతో సర్పంచ్ నివాళులర్పించారు. సావిత్రిబాయిపూలే దేశ సామాజిక చరిత్రలో చేసిన విప్లవాత్మక పోరాటాన్ని స్మరించుకోవడం ప్రతిపౌరుని కర్తవ్యం అని ఆయన అన్నారు.