కృష్ణా: పోలుకొండ గ్రామంలో కోడి పందాలు, జూదం వంటి అక్రమ కార్యకలాపాలపై శనివారం ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఇటువంటి అక్రమ కార్యకలాపాలు చట్టరీత్యా నేరమని, వీటిలో పాల్గొనడం వల్ల ఆర్థిక నష్టంతో పాటు కుటుంబాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.