AP: బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్ వద్ద చేపల వేట బోటులో అగ్నిప్రమాదం సంభవించింది. జెట్టీ వద్ద ఆపి ఉంచిన చేపల వేట బోటులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. మంటలు పెరుగుతుండటంతో మత్స్యకారులు బోటులో నుంచి కిందకు దూకేశారు. అగ్నిప్రమాదంలో బోటు, వలలు పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.