తిరుమల: శ్రీవారిని శుక్రవారం రికార్డు స్థాయిలో 83,032 మంది భక్తులు దర్శించుకున్నారు. వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో టీటీడీ అదనంగా 15 వేల మందికి దర్శన భాగ్యం కల్పించింది. నిన్న స్వామివారికి 27,372 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా, హుండీ ద్వారా రూ. 4.1 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. జనవరి 8 వరకు సర్వదర్శనం భక్తులకు ప్రాధాన్యత ఇస్తున్నారు.