KMM: విద్యే సమాజ అభివృద్ధికి పునాది అని జిల్లా అటవీ శాఖాధికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్ అన్నారు. న్యూ ఇయర్ పిలుపులో భాగంగా సేకరించబడిన పుస్తకాలు, ఇతర విద్యా సామగ్రిని DFO ఖమ్మం నగరంలోని మామిళ్లగూడెంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పంపిణీ చేశారు. విద్యార్థులు చదువుతోపాటు పర్యావరణంపై అవగాహన కలిగి ఉండాలని DFO సూచించారు.