SKLM: ఇప్పిలి, శ్రీకూర్మం గ్రామాలలో ఎమ్మెల్యే శంకర్ శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఉపాధి అధికారులతో మాట్లాడి 125 రోజులు ఉపాధి పనులు కల్పించాలని సూచించారు. అనంతరం గ్రామంలో 911 రైతులకు రాజమద్రతో ముద్రించిన పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఆర్డీవో సాయి ప్రత్యూష పాల్గొన్నారు.