TG: ఇవాళ ఐదు కీలక బిల్లులను సభ ఆమోదించింది. ఇందులో అత్యధికంగా 4 బిల్లులను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రవేశపెట్టారు. మున్సిపాలిటీల బిల్లు-2025, GHMC (సవరణ) బిల్లు-2025, GHMC (రెండో సవరణ) బిల్లు-2025తో పాటు తెలంగాణ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు-2025 ఉన్నాయి. అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్.. తెలంగాణ మోటార్ వెహికల్స్ టాక్సేషన్ బిల్లు-2025ను సభలో ప్రవేశపెట్టారు.