MHBD: ఈనెల 18న ఖమ్మం పట్టణంలో 5 లక్షల మందితో జరిగే సీపీఐ 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాలను నిర్వహించనున్నారు. ప్రజలు ఈ సభను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బి.విజయ సారథి ఇవాళ పిలుపునిచ్చారు. భూ పోరాటాలు నిర్వహించి వేలాది మంది ప్రజలకు ఇంటి స్థలాలు పంచిన చరిత్ర సీపీఐదే అని అన్నారు.