MNCL: మందమర్రి ఏరియా కేకే వోసీపీలో HMS వైస్ ప్రెసిడెంట్ బెడ్డల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం గేట్ మీటింగ్ నిర్వహించారు. ముఖ్య అతిధిగా HMS జనరల్ సెక్రటరీ రియాజ్ అహ్మద్ హాజరై యూనియన్ జెండా ఆవిష్కరించారు. ఏరియా కార్మికులకు అండగా ఉంటామని, KK- OCPలోని కార్మికులకు HRA వచ్చేవరకు HMS పోరాడుతుందన్నారు. మహిళా కార్మికులకు HMS అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.