గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో రేపు నిర్వహించనున్న ఇన్నర్ రింగ్ రోడ్డు (ఫేజ్-3) శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు కోరారు. తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్పొరేటర్లతో శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. నగరాభివృద్ధిలో కీలకమైన ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి కూటమి నాయకులు పాల్గొనాలన్నారు.