GDWL: ఎర్రవల్లి మండల పరిధిలోని కోదండాపురం పోలీస్ స్టేషన్లో నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన తరుణ్ కుమార్ రెడ్డిని మండల బీజేపీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. మండలంలో శాంతిభద్రతలను పర్యవేక్షించి కాపాడాలని విన్నవించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు కేకే రెడ్డి, మండల అధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డి, శివరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.