VSP: అగనంపూడి నుండి స్టీల్ ప్లాంట్ వెళ్లే ఏలేరు కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. శుక్రవారం ఉదయం కాల్వలో మృతదేహం ఉన్నట్లు సమాచారం అందడంతో స్టీల్ ప్లాంట్ పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ కేశవరావు తెలిపారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.