గుంటూరు జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో జిల్లా అదనపు ఎస్పీ (ఏఆర్)A. హనుమంతు పర్యవేక్షణలో, రిజర్వ్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాసరావు పరేడ్ కమాండర్‌గా ఆర్మ్డ్ రిజర్వ్ విభాగ పోలీస్ సిబ్బందితో ఈరోజు పోలీస్ పరేడ్ నిర్వహించారు. ఈ పరేడ్‌కు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ హాజరై, పోలీస్ సిబ్బంది తరపున పరేడ్ కమాండర్ చే గౌరవ వందనం స్వీకరించి ఆర్మ్డ్ రిజర్వ్ ఘనతను తెలియజేశారు.