MBNR: మిడ్జిల్ మండలం వెలుగోముల గ్రామానికి బస్ సేవలను లాక్డౌన్లో పరిస్థితుల దృష్ట్యా నిలిపివేశారు. ఇవాళ బస్సు సేవలను సర్పంచ్ సువర్ణమ్మ పునః ప్రారంభించి డ్రైవర్, కండక్టర్లకు సన్మానం చేశారు. ఆమె మాట్లాడుతూ.. వ్యక్తిగత వాహన ప్రయాణాలు తగ్గించి, బస్సు రవాణా సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఆమె గ్రామస్థులను కోరారు.