BHPL: గోరికొత్తపల్లి మండలం నిజాంపల్లి గ్రామంలోని అంగన్వాడి సెంటర్ను ఇవాళ గ్రామ సర్పంచ్ సునీత, స్థానిక వార్డు మెంబర్ సురేష్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన నాణ్యతను స్వయంగా పరీక్షించి తగిన సూచనలు ఇచ్చారు. అనంతరం పిల్లలకు గుడ్లు, బాలామృతం పంపిణీ చేశారు. అలాగే ఒక చిన్నారికి సర్పంచ్ చేతుల మీదుగా అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు.