KMR: నూతన సంవత్సరం సందర్భంగా కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ.. గత ఏడాది జిల్లా పోలీసులు చూపిన తెగువను, సమన్వయాన్ని అభినందించారు. గత ఏడాది రోడ్డు ప్రమాదాలను అరికట్టి, 64 మరణాలను తగ్గించగలిగామని తెలిపారు. నూతన సంవత్సరంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరింత పారదర్శకమైన సేవలు అందిస్తామని స్పష్టం చేశారు.