MBNR: నవాబ్‌పేట మండల పరిధిలోని పర్వతాపూర్ శ్రీ మైసమ్మ అమ్మవారి జాతర వైభవంగా ప్రారంభమైంది. తొలిరోజు కాకర్లపహాడ్ గ్రామం నుంచి భక్తులు సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలు సమర్పించారు. డప్పు వాయిద్యాలు, బోనాలు, విద్యార్థుల కోలాటాల మధ్య ఊరేగింపుగా తరలివచ్చారు. గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, ఆలయ ఛైర్మన్, ఈఓ ఆధ్వర్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.