BDK: ఉపాధి హామీ చట్టానికి నిలువునా తూట్లు పొడిచి ‘వీబీ జీ-ఆర్ఎం జీ’ పేరుతో తీసుకొచ్చిన కొత్త పథకం పేదల పాలిట శాపంగా మారిందని సీఐటీయు అఖిల భారత ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ విమర్శించారు. ఉపాధి హామీని నిర్వీర్యం చేసి పేదలపైన, లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికుల హక్కులపైన దాడి చేస్తూ మోడీ ప్రభుత్వం తన ప్రజావ్యతిరేక ముఖాన్ని నగంగా బయటపెట్టుకుందని దుయ్యబట్టారు.