MDK: శివంపేట్ మండలం రూప్లా తండాలో తెలంగాణ క్రీడా ప్రాంగణం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన బోర్డు రంగు ఊడిపోవడంతో చదవలేని స్థితికి చేరింది. పిల్లలు, యువత క్రీడలు ఆడడానికి సరైన వేదిక లేక ఇబ్బందులు పడుతున్నారు. బోర్డు తప్ప మైదానంలో ఏ వసతి లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించాని కోరుతున్నారు.