ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది సంగీతాభిమానులకు వినోదం పంచిన MTV మ్యూజిక్ ఛానెల్స్‌కు తెరపడింది. పారామౌంట్ గ్లోబల్ ఆధ్వర్యంలోని MTV డిసెంబర్ 31న తమ అనుబంధ 24 గంటల సంగీత ఛానెల్స్‌ను శాశ్వతంగా మూసివేసింది. 1981 ఆగస్టు 1న MTV ప్రారంభమైంది. తొలి మ్యూజిక్ వీడియో బగుల్స్ బృందం పాడిన ‘వీడియో కిల్డ్ ది రేడియో స్టార్’ అనే చివరి వీడియోను ప్రసారం చేస్తూ వీడ్కోలు పలికింది.