TPT: తిరుమల శ్రీవారి ఆలయంలో సర్వదర్శనం శుక్రవారం వేకువజాము నుంచి ప్రారంభమైంది. సర్వదర్శనానికి సుమారు 20 నుంచి 24 గంటల సమయం పడుతోంది. శిలా తోరణం నుంచి క్యూ లైన్ కొనసాగుతోంది. గురువారం 65,225 మంది స్వామి వారిని దర్శించుకోగా 31,106 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.3.63 కోట్ల ఆదాయం వచ్చినట్లు TTD ప్రకటించింది.