ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఉదయం లేవగానే కొన్ని పనులు తప్పక చేయాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఉదయాన్నే గ్లాస్ గోరువెచ్చని నీరు తాగితే రోజంతా శరీరం హైడ్రేటెడ్‌గా, చురుగ్గా ఉంటుంది. అలాగే ధ్యానం, యోగా ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను పెంచుతాయి. పోషకాహారం తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది. ఇక చర్మంపై సూర్యరశ్మి పడితే ఇమ్యూనిటీ, మానసిక స్థితికి మంచిది.